SRD: సంగారెడ్డి మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు పెంచాలని కోరుతూ శిక్షణా కలెక్టర్ మనోజ్‌కు సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం వినతి పత్రం సమర్పించారు. కార్మికులకు తక్కువ వేతనాలు ఇచ్చి పని చేయించుకుంటున్నారని ఆరోపించారు. నెలకు 26 వేల రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.