TG: ఆటో కార్మికులపై BRSకు చిత్తశుద్ధి లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ‘కావాలనే బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తోంది. పదేళ్లలో ఆటో కార్మికులకు ఆ పార్టీ చేసిందేమీ లేదు. మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల ఆటోలపై ప్రభావం పడిందనటం తప్పు. ఆర్థిక సంక్షోభం వల్ల ఆటో కార్మికులకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వలేకపోయాం. కానీ మా ప్రభుత్వం వారిని ఆదుకుంటుంది. BRS నేతలు రాజకీయ డ్రామా చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.