TG: ఆటో డ్రైవర్ల సమస్యలంటూ BRS డ్రామాలు ఆడుతుందని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకానికి వ్యతిరేకంగానే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. పేదింటి మహిళలకు ఉచిత బస్సు ఇవ్వకూడదా అని BRSను ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ఓలా, ఉబర్ వంటి వాటిని ప్రోత్సహించారన్నారు. స్కాలర్షిపులు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఫైర్ అయ్యారు.