మెనోపాజ్ దశలో ఎదురయ్యే పలు అనారోగ్యాల్లో దంత సమస్య కూడా ఒకటి. అయితే మెనోపాజ్ దశకు చేరుకున్న 50 శాతం మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. దీన్ని అధిగమించాలంటే కాల్షియం, డి-విటమిన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ వాడాలి. రోజులో రెండుసార్లు బ్రష్ చేయడం తప్పనిసరి. నీళ్లు ఎక్కువగా తాగుతుండాలి.