బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్, అనగ అజిత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘లీలా వినోదం’. రేపటి నుంచి ఈ సిరీస్ ‘ఈటీవీ విన్’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో ఇవాళ రాత్రి 7 గంటలకు HYD ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రీమియర్ షో వేస్తున్నట్లు మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక పవన్ సుంకర తెరకెక్కించిన ఈ సిరీస్‌కు ఆర్ కృష్ణ చేతన్ మ్యూజిక్ అందించాడు.