PPM: పార్వతీపురం మండలం వెంకంపేట గ్రామంలో ఈ నెల 23 నుండి జంఝావతి ప్రాజెక్టు సాధన యాత్ర ప్రారంభమవుతుందని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు జాగరపు ఈశ్వర ప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ ప్రారంభించి ఐదు దశాబ్దాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యంగా యాత్ర సాగుతుందన్నారు.