TG: అసెంబ్లీలో BRS నేతల తీరుపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. ‘BRS నేతలు రూల్స్ ప్రకారం నడుచుకోవాలి. అధికారం మారగానే బీఆర్ఎస్ సభ్యులు వేషాలు మారుస్తున్నారు. రోజుకో వేషంలో సభకు వస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆటో డ్రైవర్లను పట్టించుకోలేదు. పదేళ్లలో చేయకుండా 10 నెలల్లో ఎలా చేయాలి. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి.. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం’ అని పేర్కొన్నారు.