TG: మండలిలో అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు సమాధానాలు ఇస్తోందని MLC కవిత మండిపడ్డారు. నిన్న జరిగిన మూసీ ప్రాజెక్టు విషయాన్ని మంత్రి శ్రీధర్ బాబు తప్పుదోవ పట్టించారని ధ్వజమెత్తారు. మూసీ కోసం ప్రపంచ బ్యాంక్ దగ్గర డబ్బులు అడగలేదని మంత్రి చెబుతున్నారని.. కానీ, బ్యాంక్ నుంచి రుణం అడిగినట్లు తన దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి, ప్రపంచ బ్యాంకుకు చెప్పేది వేర్వేరుగా ఉన్నాయన్నారు.