AP: ఒక గంట నీళ్లు తాగకపోతే ఎంత కష్టమో అందరికి తెలుసని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. నీరు దొరకనప్పుడే దాని విలువ తెలుస్తుందని చెప్పారు. ఉన్నత ఆశయంతో మొదలుపెట్టిన జల్జీవన్ మిషన్ను ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోతున్నామని బాధపడుతుండేవాణ్ని అని వెల్లడించారు. నీటి సరఫరాలో తరచూ వచ్చే ఇబ్బందుల పరిష్కారానికి అమృతధార కింద విధివిధానాలకు రూపకల్పన చేస్తున్నట్లు పేర్కొన్నారు.