TG: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రోడ్లు, భవనాలశాఖ(R&B) అప్రమత్తంగా ఉందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. వరదల్లో సుమారు 230 కి.మీల రోడ్లు దెబ్బతిన్నాయి. ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, కాజ్వేల పునరుద్ధరణకు ఇప్పటికే రూ.7 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.