TG: తెలంగాణ సమాజానికి మాజీ సీఎం కేసీఆర్‌పై నమ్మకం ఉందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. కవిత వ్యాఖ్యలు పార్టీని బలహీనపరిచేలా ఉన్నాయని మండిపడ్డారు. కవిత సస్పెండ్‌ను పార్టీ శ్రేణులు స్వాగతించాయని చెప్పారు. ఆమె వ్యాఖ్యలు చాలా బాధాకరమన్నారు. రాజీనామాపై పునరాలోచించుకోవాలని సూచించారు.