AP: ఎగువన కురిసిన భారీ వర్షాలకు కృష్ణా, ఉపనదులకు భారీ వరద వస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ మేరకు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది వరదను ఇరిగేషన్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈరోజు సాయంత్రం ప్రకాశం బ్యారేజికి 6 నుంచి 6.5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే అవకాశం ఉందని చెప్పారు.