AP: ఈరోజు సాయంత్రం శ్రీహరికోట నుంచి PSLV-C59 రాకెట్ ప్రయోగం చేయనుండటంతో విజయవంతం కావాలని ISRO ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూళ్లూరుపేట లోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవీ ఆలయంలో రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే తిరుమల శ్రీవారిని ISRO బృందం దర్శించుకుంది.