తమిళనాడులో ఓ యువతి పోలీసులకు చుక్కలు చూపించింది. ఫుల్గా మందేసి రోడ్డుమీదకి రచ్చచేసింది. పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించింది. డ్రంకెన్ టెస్ట్ చేయనీవ్వకుండా హంగామా క్రియేట్ చేసింది. చెన్నైకి చెందిన మీనా స్నేహితులతో కలిసి ఓ పార్టీలో పాల్గొంది. ఫుల్లుగా మందు తాగి, పార్టీ అయిపోయిన తర్వాత స్కూటీ మీద ఇంటికి బయలు దేరింది. సైదాపేట వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయింది. స్కూటీ తాళం చెవి తీసుకుని, కిందకు దిగమని చెప్పారు. బ్రీత్ ఆనలైజర్లో ఊదమని కోరగా, ఒప్పుకోలేదు. పోలీసులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా వినలేదు. బ్రీత్ ఎనలైజర్ లో ఊదితే స్కూటీ తాళం చెవి ఇస్తామని అనడంతో ఒప్పుకుంది. మీటర్లో 183 పర్సెంటేజ్ చూపించింది. స్కూటీని పక్కకు పెట్టి, వేరే వాహనంలో ఇంటికి వెళ్లి, ఉదయం వచ్చి బండి తీసుకొమ్మని చెప్పారు.
అప్పటికే మందు మత్తులో ఉన్న మీనా పోలీసులతో గొడవకు దిగింది. బ్రీత్ ఆనలైజర్లో ఊదితే స్కూటీ కీస్ ఇస్తామని చెప్పి మాట తప్పారని మండిపడింది. ‘నేను క్లియర్గా ఉన్నా.. 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడుగా వెళ్లను. మహిళ మీద దౌర్జన్యం చేస్తున్నారా? తాగనిది ఎవరు? రోజు తాగి బండి నడుపుతూ ఇంటికి వెళతా? ఈరోజు ఆపి ప్రశ్నిస్తున్నారు..? నాకు ఫైన్ వేసినా కట్టను. నా దగ్గర చిల్లి గవ్వ లేదు. నేనే ఫ్రీగా మందు తాగి వస్తున్న.. డబ్బు కట్టలేను. నన్ను జైలులో వేయాలనుకుంటే వేయండి. మీలాగా నాకు పని లేదు. ఇంట్లో సామాన్లు అమ్మి బతుకుతున్నా. నాకు ఫైన్ వేయమని మీకు ఎవరు చెప్పారు’ అని పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించింది.