»Delhi Government Sold 61 Crore Liquor Bottles In One Year
Delhi Liquor Sale: ఏడాదిలో 61కోట్ల మందు బాటిళ్లు తాగేసిన రాజధాని వాసులు.. వేలకోట్లు సంపాదించిన ప్రభుత్వం
రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలతో ఒక్క ఏడాదిలో ప్రభుత్వ ఖజానాకు రూ.7,285 కోట్లకు పైగా చేరింది. పాత ఎక్సైజ్ పాలసీ ప్రకారం సెప్టెంబర్ 1, 2022 నుంచి ఆగస్టు 31, 2023 మధ్య ఢిల్లీ ప్రభుత్వం మద్యం అమ్మకాల ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించిందని ఢిల్లీ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.
Delhi Liquor Sale: దేశ రాజధాని ఢిల్లీ జనాలు పీపాలకు పీపాలు తెగ తాగేస్తున్నారు. మద్యం సేవించడంతో వారు సరికొత్త రికార్డులు సృష్టించారు. ఢిల్లీ ప్రభుత్వ ప్రస్తుత ఎక్సైజ్ పాలసీ లేదా పాత ఎక్సైజ్ పాలసీ ప్రకారం గత ఏడాది కాలంలో మొత్తం 61 కోట్లకు పైగా మద్యం సీసాలు అమ్మడు అయిపోయారు. రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలతో ఒక్క ఏడాదిలో ప్రభుత్వ ఖజానాకు రూ.7,285 కోట్లకు పైగా చేరింది. పాత ఎక్సైజ్ పాలసీ ప్రకారం సెప్టెంబర్ 1, 2022 నుంచి ఆగస్టు 31, 2023 మధ్య ఢిల్లీ ప్రభుత్వం మద్యం అమ్మకాల ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించిందని ఢిల్లీ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. దీని ద్వారా ప్రభుత్వం ఏడాది వ్యవధిలో రూ.7,285.15 కోట్లు ఆర్జించింది. ఇందులో వ్యాట్ ద్వారా 2,013.44 కోట్లు ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం 2021-22లో కొత్త ఎక్సైజ్ పాలసీ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఢిల్లీ ప్రభుత్వం మద్యం ద్వారా రూ.5,487.58 కోట్లు సంపాదించింది.
ఢిల్లీ ప్రభుత్వ కొత్త ఎక్సైజ్ పాలసీపై రాజకీయ పార్టీల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీని కోసం ఢిల్లీ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా కూడా పలు నిబంధనలను విస్మరించారని ఆరోపిస్తూ సీబీఐ విచారణకు సిఫారసు చేశారు. దీని తర్వాత ఈ కేసు దర్యాప్తులో అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అక్రమాస్తుల ఆరోపణలపై అరెస్టయ్యారు. కొత్త ఎక్సైజ్ పాలసీని ఢిల్లీ ప్రభుత్వం నవంబర్ 17, 2021న అమలు చేసింది. అనేక ఆరోపణల తర్వాత ఆగస్టు 31, 2022న ఉపసంహరించుకుంది. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వ కొత్త ఎక్సైజ్ పాలసీ వర్తించదు. పాత విధానం, నిబంధనల ఆధారంగానే ఢిల్లీలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే జీ20సమ్మిట్ కారణంగా ఢిల్లీలో వరుసగా ఐదు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.