AP: 2019లో TDP దిగిపోయే నాటికి 3లక్షల 13వేల కోట్ల అప్పు ఉందని మాజీ CM జగన్ అన్నారు. 2024లో తాము దిగిపోయే నాటికి 6 లక్షల 46వేల కోట్ల అప్పు ఉందన్నారు. కానీ TDP మాత్రం 10 – 14లక్షల కోట్ల అప్పు ఉందని ప్రచారం చేశారని చెప్పారు. తీరా బడ్జెట్లో 6లక్షల కోట్లు చూపించారని తెలిపారు. TDP హయాంలో 19 శాతం అప్పులు పెరిగితే.. తమ హయాంలో 15శాతం అప్పులు పెరిగాయన్నారు. ఈ క్రమంలో అప్పు రత్న అనే బిరుదు ఎవరికి ఇవ్వాలని ప్రశ్నించారు.