చల్లటి నీళ్లతో స్నానం చేయడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అనారోగ్య సమస్యలతో పోరాడే శక్తి లభిస్తుంది. ఆందోళన, ఒత్తిడి తగ్గి.. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరం రిఫ్రెష్ అవుతుంది. కండరాల నొప్పుల నుంచి రిలీఫ్ కలగడంతో పాటు జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. అయితే చల్లని నీటిని నేరుగా తలపై పోసుకోకూడదు. దగ్గు, జ్వరం ఉన్నవారు చల్లని నీటితో స్నానం చేయకూడదు.