TG: కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ మైనింగ్, రియల్ ఎస్టేట్ దందాలు సాగిస్తోందని హరీష్ రావు మండిపడ్డారు. రాజేంద్రనగర్ మానస హిల్స్‌లో అనుమతులు లేకుండా కొండలు తవ్వుతున్నారని తెలిపారు. సీఎం అనుయాయులకు ఓపెన్ బిడ్డింగ్ లేకుండా 17 ఎకరాలు కట్టబెట్టారని ఆరోపించారు. హైడ్రాకు మంత్రులు, వాళ్ల బంధువులు చేస్తున్న అక్రమ మైనింగ్, భూకబ్జాలు ఎందుకు కనిపించట్లేదని నిలదీశారు.