AP: మూడు రాజ్యసభ స్థానాలకు బీద మస్తాన్రావు, సానా సతీశ్, ఆర్. కృష్ణయ్య నామినేషన్లు వేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు.. బీసీలకు టీడీపీ ఎప్పుడూ పెద్ద పీట వేస్తుందన్నారు. ఇప్పుడు కూడా ఇద్దరు బీసీలకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఆర్.కృష్ణయ్య జాతీయ బీసీ నాయకుడు.. ఆయనపై కామెంట్ చేసేవాళ్లకు బుద్ధి, జ్ఞానం లేదని మండిపడ్డారు.