AP: మెడికల్ కాలేజీల్లో గత ప్రభుత్వ విధానంపై మంత్రి సత్యకుమార్ విమర్శలు గుప్పించారు. ‘ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల విధానం తెచ్చారు. ప్రైవేట్, ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు తేడా లేకుండా పోయింది. వచ్చే రెండేళ్లలో PPP విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేస్తాం. కూటమి ప్రభుత్వ విధానంతో ప్రతి కాలేజీలో అదనంగా 11 మెడికల్ సీట్లు కేటాయించాం’ అని వెల్లడించారు.