పిల్లలకు లైంగిక విద్యను చిన్నప్పటి నుంచే బోధించడం అవసరమని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. యుక్తవయస్సులో హార్మోన్ల మార్పులపై అవగాహన కల్పించడానికి హైయ్యర్ సెకండరీ సిలబస్‌లో లైంగిక విద్యను భాగం చేయాలని జస్టిస్‌లు సంజయ్, ఆలోక్ ధర్మాసనం పేర్కొంది. పోక్సో కేసులో నిందితుడైన మైనర్ బాలుడికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ మేరకు ధర్మాసనం అధికారులను ఆదేశించింది.