AP: ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్పై మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఒంగోలులో భూకబ్జాలు, అక్రమాలు జరుగుతున్నాయంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే కనుసన్నల్లోనే అక్రమ మైనింగ్, ఇసుక రవాణా జరుగుతుందన్నారు. ఎక్కడపడితే అక్కడ భూకబ్జాలు చేస్తున్నారని విమర్శించారు. ఆయన దందాలను ప్రశ్నిస్తూనే ఉంటానని బాలినేని స్పష్టం చేశారు.