బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో జై తెలంగాణ అనడానికి సీఎం కేసీఆర్ సిగ్గుపడ్డారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఛలో ఢిల్లీ గోడ పత్రికలు, కరపత్రాలను పార్టీ నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని భావించడం లేదన్నారు. కృష్ణా నదీపైన ప్రాజెక్టులు అన్ని పెండింగ్లో ఉన్నాయని, కాళేశ్వరం కట్టలు పూర్తి అయ్యాయి తప్పితే.. కాలువలు పూర్తి కాలేదన్నారు. . పేదల భూములను ఇష్టానుసారంగా గుంజుకుంటున్నారన్నారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు తప్పితే అభివృద్ధి చేయలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన లేదని, విద్యా, వైద్యం, సింగరేణి ప్రైవేటు అయ్యిందని.. ముఖ్యమంత్రి నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైందన్నారు. ఈ నెల 30న కృష్ణా నదీ జలాల్లో వాటాపై డిల్లీలో పోరాడుతామని, 31న విభజన హామీలపై సెమినార్ నిర్వహిస్తామని కోదండరాం తెలిపారు.