తెలంగాణ ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రొఫెసర్ కోదండరామ్, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ పేర్లను కేబినెట్ మరోసారి ఖరారు చేసింది.
TS MLCs : తెలంగాణ ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రొఫెసర్ కోదండరామ్, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ పేర్లను కేబినెట్ మరోసారి ఖరారు చేసింది. హైకోర్టు ఆదేశాలతో ఈ ఇద్దరి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి గవర్నర్ తమిళిసైకి పంపనుంది. ఇదిలా ఉంటే తాజాగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియమితులైన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణల నియామకాన్ని రద్దు చేసే అధికారం గవర్నర్‌కు లేదని హైకోర్టు పేర్కొంది. దానిని తిరిగి కేబినెట్‌కు పంపాలని, అలా తిరస్కరించకూడదని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీల నియామకం మళ్లీ చేపట్టాలని హైకోర్టు తీర్పు చెప్పింది. దీంతో మరోసారి కేబినెట్లో ప్రభుత్వం ప్రతిపాదించిన ఎమ్మెల్సీల పేర్లను గవర్నర్‌కు పంపనున్నారు.
గతంలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాలను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదించారు. వారిద్దరిని గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడంతో తమిళిసై ఈ నిర్ణయం తీసుకునున్నారు. టీజేఎస్ పార్టీ అధినేత కోదండరాం 2018 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన విషయం తెలిసిందే. 2023 ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు.