ఐపీఎల్(IPL 2023)లో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. నిన్న జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)కు చెన్నై సూపర్ కింగ్స్(Chennai super Kings) జట్టు షాకిచ్చింది. క్వాలిఫైయర్1 మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది. దీంతో ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్‌కు చెన్నై జట్టు చేరింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది.
గుజరాత్ జట్టు(Gujarat Titans)లో శుభ్‌మన్ గిల్ 42 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగిలిన వారు అంతంత స్కోరు మాత్రమే చేశారు. చివరల్లో రషీద్ ఖాన్ 30 పరుగులు చేశాడు. ఆఖర్లో దూకుడుగా ఆడినప్పటికీ గుజరాత్ మాత్రం గెలవలేకపోయింది. 19వ ఓవర్లో చెన్నై(Chennai super Kings) బౌలర్ తుషార్ దేశ్‌పాండే వేసిన బంతికి రషీద్ ఖాన్ ఔట్ అవ్వడంతో చెన్నై విజయం సాధించింది.
చెన్నై(Chennai super Kings) బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్ 60 పరుగులు, డేవాన్ కాన్వే 40, అజింక్య రహానె 17, అంబటి రాయుడు 17 పరుగులు చేసి మంచి స్కోరును అందించారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 2, మహ్మద్ షమి 2, రషీద్ ఖాన్, దర్శన్ నల్కండే, నూర్ అహ్మద్ ఒక్కో వికెట్ తీశారు. చెన్నైతో ఓడిన గుజరాత్(Gujarat Titans)కు మరో అవకాశం ఉంది. ఫైనల్ బెర్తు కోసం ముంబయి, లక్నో మధ్య జరిగే మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందో ఆ టీమ్‌తో గుజరాత్ తలపడనుంది.