Neeraj Chopra : వరల్డ్ నంబర్ 1 ర్యాంక్ సొంతం చేసుకున్న నీరజ్ చోప్రా
ప్రపంచ అథ్లెటిక్స్ విడుదల చేసిన తాజా ర్యాకింగ్స్లో 1455 పాయింట్లతో నీరజ్ మొదటి స్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకూ వరల్డ్ చాంపియన్ గా ఉన్న అండర్సన్ పీటర్స్‌ను వెనక్కి నెట్టి ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నాడు.
అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి పసిడి పతకం అందించిన నీరజ్ చోప్రా(Neeraj Chopra) మరో రికార్డును నెలకొల్పాడు. జావెలిన్ త్రో(Javelin Throw) ఆటలో పురుషుల విభాగంలో వరల్డ్ నంబర్ 1 ర్యాంక్ ను నీరజ్ చోప్రా సొంతం చేసుకున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ విడుదల చేసిన తాజా ర్యాకింగ్స్లో 1455 పాయింట్లతో నీరజ్ మొదటి స్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకూ వరల్డ్ చాంపియన్ గా ఉన్న అండర్సన్ పీటర్స్‌ను వెనక్కి నెట్టి ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నాడు. దోహాలో మే 5వ తేదీన ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్‌లో గోల్డ్ మెడల్ గెలిచాడు. తొలి ప్రయత్నంలోనే అతను జావెలిన్‌ను 88.67 మీటర్ల దూరం విసిరి రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.