ఐపీఎల్ (IPL)లో ప్లేఆఫ్స్ కు చేరకుండానే జట్టు వెనుదిరిగిపోవడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతోపాటు మరొక విషయం కూడా వారిని కలవరపరుస్తోంది. వారినే కాదు మొత్తం భారత క్రికెట్ అభిమానులే ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. అదే కోహ్లీకి (Virat Kohli) గాయమైన విషయం. కోహ్లీకి అయిన గాయం (Injure) తీవ్రమైనదా? అనేది కోహ్లీ అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద గాయమైతే తదుపరి మెగా టోర్నీల్లో ఆడుతాడా? లేదా అని తెగ మదనపడి పోతున్నారు. అయితే వీరి ఆందోళనను గమనించిన ఆర్సీబీ కోచ్ సంజయ్ బంగర్ (Sanjay Bangar) కీలక ప్రకటన చేశారు. ఆ ప్రకటనతో కోహ్లీ అభిమానులు హమ్మయ్య అనుకున్నారు.
చదవండి:RCB ఓటమిపై పండగ చేసుకున్న నవీనుల్ హక్.. ఇన్ స్టా స్టోరీపై లొల్లి లొల్లి
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో (M Chinnaswamy Stadium) ఆదివారం గుజరాత్ టైటన్స్ (Gujarat Titans)తో బెంగళూరు తలపడింది. ఐపీఎల్ ప్లేఆఫ్స్ కు వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ (Match)లో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో ఫీల్డింగ్ సమయంలో కోహ్లీ గాయపడ్డాడు. విజయ్ శంకర్ (Vijay Shankar) క్యాచ్ ను అందుకోబోయి కోహ్లీ గాయం బారిన పడ్డాడు. ఈ కారణంగానే మ్యాచ్ నుంచి కోహ్లీ అర్ధాంతరంగా డగౌట్ (Dugout)లోకి వెళ్లిపోయాడు. మ్యాచ్ మొత్తం మైదానంలోకి దిగలేదు. ఈ పరిణామంపై ఆందోళన చెందుతుండగా ఆర్సీబీ కోచ్ సంజయ్ బంగర్ స్పందించారు.
‘కోహ్లీ మోకాలికి (Knee) చిన్న గాయం తగిలిన మాట వాస్తవమే. కానీ అది తీవ్రమైన గాయం మాత్రం కాదు. నాలుగు రోజుల వ్యవధిలో అతడు రెండు శతకాలు (Centuries) బాదాడు. ఇదొక ప్రత్యేక ఘనత. కేవలం బ్యాట్ తోనే కాదు ఫీల్డింగ్ (Fieldingg)లోనూ జట్టుకు ఏదో ఒకటి చేయాలని కోహ్లీ భావిస్తాడు. అందుకే మైదానంలో ఎక్కువగా పరుగెడుతుంటాడు. రెండు రోజుల కిందట 40 ఓవర్లు ఆడిన అతడు.. జీటీ మ్యాచ్ లో 35 ఓవర్ల పాటు మైదానంలో గడిపాడు. ఉత్తమ ప్రదర్శనే ఇచ్చాడు. అతడి వయసు 35 ఏళ్లు అని మరచిపోకూడదు. కాబట్టి ఏదో ఒక సమయంలో ఇది ఇబ్బందిగా మారవచ్చు. కానీ ప్రస్తుతానికైతే ఈ గాయం పెద్ద సమస్య అని నేను అనుకోవడం లేదు’ అని సంజయ్ స్పష్టత ఇచ్చారు.