»Shock For Credit Card Users Tax Will Be Waived From July 1
Credit Cards: క్రెడిట్ కార్డు వాడేవారికి షాక్..జులై 1 నుంచి ట్యాక్స్ బాదుడు!
పన్ను చెల్లింపు విధానంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశం నుంచి ఇతర దేశాలకు చేసే చెల్లింపులపై కూడా 20 శాతం పన్ను(Tax) విధించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో క్రెడిట్ కార్డు వాడే వారికి పన్ను భారం తప్పడం లేదు.
క్రెడిట్ కార్డు(Credit Cards) వాడేవారికి చేదువార్త. అంతర్జాతీయ క్రెడిట్ కార్డు భారాన్ని రెమిటెన్స్ స్కీమ్ కిందకు తీసుకొచ్చేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ(Ministry of Finance) చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ కింది కొన్ని రూల్స్ (Rules)ను తెచ్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(nirmala sitaraman) 2023 ఫైనాన్స్ బిల్లు(Finance Bill)ను ప్రవేశపెట్టినట్లు కొన్ని నిబంధనలను తీసుకొచ్చారు. విదేశీ పర్యటనపై క్రెడిట్ కార్డుతో చేసే చెల్లింపులు ఎల్ఆర్ఎస్ పరిధిలోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
ఈ తరుణంలో కేంద్ర సర్కార్(central Government) తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రెడిట్ కార్డు(Credit Cards)ల ద్వారా విదేశాలకు ట్రాన్సాక్షన్లు చేస్తే జులై 1 నుంచి 20 శాతం ట్యాక్స్(Tax) చెల్లించాల్సి ఉంటుంది. కేంద్రం ఈ కొత్త రూల్ (New Rule)ను అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం భారత్ లో అయితే క్రెడిట్ కార్డు నుంచి విదేశాలకు చెల్లింపులు చేస్తే 5 శాతం ట్యాక్స్(Tax) విధిస్తోంది.
అయితే ఈ పన్ను చెల్లింపు విధానంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశం నుంచి ఇతర దేశాలకు చేసే చెల్లింపులపై కూడా 20 శాతం పన్ను(Tax) విధించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో క్రెడిట్ కార్డు వాడే వారికి పన్ను భారం తప్పడం లేదు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో క్రెడిట్ కార్డు(Credit Cards) దారులు ఆందోళన చెందుతున్నారు.