TG: కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన ఉపాధ్యాయులు.. చికిత్స కోసం వారిని జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. మధ్యాహ్న భోజనంలో గుడ్లు వాసన వచ్చాయని, అన్నంలో పురుగులు ఉన్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు.