»Beer Wine Can Now Be Served Haryanas Corporate Offices
Good News: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఆఫీసుల్లో ఇక తాగినంత బీరు, వైన్
హర్యానా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఆఫీసుల్లో బీర్, వైన్ సర్వ చేసేలా పర్మిషన్ నిమిత్తం ప్రత్యేక పాలసీని తీసుకొచ్చారు. ఈ పాలసీ ప్రకారం అన్ని కార్పొరేట్ ఆఫీసుల్లో తక్కువ కంటెంట్ ఆల్కహాల్ డింక్స్( వైన్, బీర్) ని సర్వ్ చేసేలా అనుమతిని ఇస్తున్నట్లు తెలిపింది.
Good News: హర్యానా ప్రభుత్వం(Haryana Govt) సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఆఫీసు(Office)ల్లో బీర్(Beer), వైన్ సర్వ చేసేలా పర్మిషన్ నిమిత్తం ప్రత్యేక పాలసీని తీసుకొచ్చారు. ఈ పాలసీ ప్రకారం అన్ని కార్పొరేట్ ఆఫీసు(Corporate Office)ల్లో తక్కువ కంటెంట్ ఆల్కహాల్ డింక్స్( వైన్, బీర్) ని సర్వ్ చేసేలా అనుమతిని ఇస్తున్నట్లు తెలిపింది. ఈ పాలసీ నిబంధన ప్రకారం కార్పొరేట్ ఆఫీసుల్లో సుమారు 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంటీన్ ఉండాలి. ఈ మేరకు హర్యానా క్యాబినేట్(Haryana cabinate) మంగళవారం ఈ కొత్త పాలసీ 2023-24కి ఆమోదం తెలిపింది. రిటైల్ పర్మిట్ రుసుము(Retail permit fee) కింద పర్యావరణం, జంతు సంక్షేమ నిధి కోసం రూ. 400 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం టార్గెట్ ను పెట్టుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ తర్వాత దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేశారు.
హర్యానా రాష్ట్రంలో వైన్ తయారీ కేంద్రాలను ప్రోత్సహించేందుకు వైన్ తయారీ కేంద్రాల పర్యవేక్షక రుసుమును ప్రభుత్వం తగ్గించినట్లు వెల్లడించారు. పంచకులలోని శ్రీ మాతా మానస దేవి ఆలయం చుట్టుపక్కల.. సర్కార్ నోటిఫై చేసిన పవిత్ర ప్రాంతాలు, గురుకులాలు ఉన్న గ్రామాలలో మద్యం దుకాణాలు తెరవకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొంది. కొత్త పాలసీలో దేశీయ మద్యం, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఇంపోర్టెడ్ ఫారిన్ లిక్కర్ బేసిక్ కోటాను కూడా పెంచారు. దీంతో దేశీయ మద్యం, IMFL పై ఎక్సైజ్ సుంకం రేట్లలో నామమాత్రపు పెరుగుదల ఉంది. ఈ పెంపుతో ఎక్సైజ్ పై ఆదాయానికి పెద్దపీట వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. అలాగే సూక్ష్మ మధ్య తరహా రంగాన్ని ప్రోత్సహించడానికి చిన్న షాపులకు లైసెన్స్ ఫీజును తగ్గించింది.