TG: హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ అరెస్ట్ దుమారం రేపుతోంది. అయితే తాము ప్రీమియర్ షో గురించి పోలీసులకు ముందే సమాచారం ఇచ్చామని సంధ్య థియేటర్ యాజమాన్యం స్పష్టం చేస్తోంది. కానీ హీరో థియేటర్‌కు వెళ్లడంలో అభ్యంతరం లేదని.. కానీ ర్యాలీ విషయం తమకు తెలియదని.. ఈ కారణంగానే తొక్కిసలాట జరిగిందని పోలీసులు వివరణ ఇస్తున్నారు. దీంతో బన్నీని అరెస్ట్ చేశారని సమాచారం.