ఒడిశా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఉదయం పూరీలోని శ్రీ జగన్నాథ ఆలయాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పర్యటనలో భాగంగా భారత మాజీ రాష్ట్రపతి ఆర్.వెంకటరామన్‌కు నివాళులు అర్పించారు. ఇవాళ ఆయన జయంతి సందర్భంగా భువనేశ్వర్‌లోని రాజ్‌భవన్‌లో వెంకటరామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి, అంజలి ఘటించారు.