మారిషస్లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ వెల్లడించారు. 2027 జనవరి 8, 9, 10 తేదీల్లో తెలుగు మహాసభలు ఉంటాయని తెలిపారు. మారిషస్లో సభలకు తరలిరావాలని మారిషస్ తెలుగు మహాసభ కోరింది. ఆంధ్ర సారస్వత పరిషత్, మారిషస్ తెలుగు మహాసభ, అసోషియేషన్ల మధ్య ఎంవోయూ కుదిరింది. ఈ మేరకు అవగాహన ఒప్పందంపై ఇరుదేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు.