VSP: జిల్లాలో సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ విశాఖ నుంచి భారీగా ప్రత్యేక సర్వీసులు నడపనుంది. ఈ నెల 10 నుంచి 17 వరకు విశాఖలోని వివిధ డిపోల నుంచి మొత్తం 1,007 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి బి. అప్పలనాయుడు తెలిపారు. శ్రీకాకుళానికి 238, విజయవాడకు 215 సర్వీసులు కేటాయించారు.