»Advanced Light Helicopter Can Be Used Post Technical Checkup Grounded After Three Dhruv Helicopter Crash
ALH Dhruv Helicopter: మళ్లీ ఎగరనున్న ‘ధృవ్’ హెలికాప్టర్లు
స్వదేశీ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ 'ధృవ్'('Dhruv') ఇప్పుడు మళ్లీ ఎగురుతుంది. ప్రత్యేక మిషన్లలో కాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఈ తేలికపాటి హెలికాప్టర్(Helicopter)ను ఉపయోగించడానికి అనుమతి ఇవ్వబడింది. ఒక నెల క్రితం సైన్యం దాని ప్రయాణాన్ని నిషేధించింది.
ALH Dhruv Helicopter: స్వదేశీ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ‘ధృవ్'(‘Dhruv’) ఇప్పుడు మళ్లీ ఎగురుతుంది. ప్రత్యేక మిషన్లలో కాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఈ తేలికపాటి హెలికాప్టర్(Helicopter)ను ఉపయోగించడానికి అనుమతి ఇవ్వబడింది. ఒక నెల క్రితం సైన్యం దాని ప్రయాణాన్ని నిషేధించింది. మూడు ప్రమాద ఘటనల తర్వాత ‘ధృవ్’ వాడకాన్ని నిషేధించారు. అయితే టెక్నికల్ టీమ్(Technical team) నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే ఈ హెలికాప్టర్లను ఎగిరేందుకు అనుమతిస్తారు.
సైన్యం వద్ద ధ్రువ్ ఫ్లీట్‌కు చెందిన 145 హెలికాప్టర్లు ఉన్నాయి. వీటిలో వైమానిక దళం వద్ద 70, నేవీ వద్ద 18, కోస్ట్ గార్డ్ వద్ద 20 స్వదేశీ తేలికపాటి హెలికాప్టర్లు ఉన్నాయి. ఈ హెలికాప్టర్లలో ప్రయాణించాలంటే ముందుగా సైన్యం హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సాంకేతిక లోపం, ఇతర పరిశోధనల తర్వాత మాత్రమే అది ఎగరడానికి అనుమతించబడుతుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ‘ధృవ్’ హెలికాప్టర్‌ను తయారు చేసింది.
కిష్త్వార్‌లో ధృవ్ హెలికాప్టర్ కూలిపోయింది
మే 4న ఇద్దరు పైలట్లు, టెక్నీషియన్‌తో వెళ్తున్న ‘ధృవ్’ జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో టెక్నీషియన్ మృతి చెందగా, పైలట్లిద్దరూ గాయపడ్డారు. ఈ ప్రమాదం తర్వాత సైన్యం ఈ హెలికాప్టర్ల వాడకం నిలిపివేయాలని నిర్ణయించుకుంది. అంతకుముందు నేవీ, ఆర్మీ అప్పటికే దాని వినియోగాన్ని పరిమితం చేశాయి.
ఎమర్జెన్సీ ల్యాండింగ్
మార్చి నెలలో రెండు ‘ధృవ్’లలో లోపం ఏర్పడింది. దాంతో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. నేవీ, కోస్ట్‌గార్డ్‌లు ఇలాంటి ఘటనలను ఎదుర్కోవాల్సి వచ్చింది. నేవీ బృందం అరేబియా సముద్రంలో పెట్రోలింగ్‌కు వెళ్లింది.. ఆ సమయంలో సాంకేతిక లోపం కారణంగా హెలికాప్టర్ ల్యాండ్ కావాల్సి వచ్చింది. భారత భద్రతా దళాలు లడఖ్, సియాచిన్ గ్లేసియర్లకు సైనికులను రవాణా చేయడానికి ఈ హెలికాప్టర్‌ను ఉపయోగిస్తాయి.