AP: పాలకొల్లులో పర్యటన సందర్భంగా మూడు గ్రామాల్లో రూ.2.5 కోట్లతో మంచినీటి పథకం పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. జల్జీవన్ మిషన్ ద్వారా కుళాయితో తాగునీరు ఇవ్వడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు. ఈ మిషన్ కింద గత ప్రభుత్వం రూ.22.5 కోట్లే ఖర్చు చేసిందని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం మిషన్ నిధులను పక్కదారి పట్టించిందని ఆరోపించారు.