సత్యసాయి: నేతన్నలకు 365 రోజులపాటు పని కల్పించడంతోపాటు చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. మంగళవారం విజయవాడలోని ఓ కల్యాణమండపంలో చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకాల స్టాళ్లను మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చేనేతల కోసం మరిన్ని ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.