సత్యసాయి: ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించి కఠోర ఉపవాస దీక్షలు చేసే రంజాన్ మాసం చివరి దశకు చేరుకుంది. ఈ మాసంలో ముస్లిం సోదరులు నాలుగు తాఖ్ రాత్లలో జాగరణ చేస్తారు. ఇందులో భాగంగా సోమందేపల్లిలోని ఫౌజియా మసీదులో మంగళవారం రాత్రి 10 గంటల నుండి తాఖ్ రాత్ మొదలవుతుందని మౌలానా తెలిపారు. ప్రతి ముస్లిం సోదరుడు ఈ తాఖ్ రాత్ (జాగరణ)కు హాజరుకావాలని కోరారు.