WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఎర్ర బంగారం పోటెత్తింది. రెండు రోజుల సుదీర్ఘ సెలవు తర్వాత వరంగల్ మార్కెట్ మళ్లీ తెరవడంతో, రైతులు భారీగా మిర్చిని తరలించారు. సుమారు 60 వేలకు పైగా మిర్చి బస్తాలు చేరుకోవడంతో, అధికారులు తక్షణమే కాంటాలు ఏర్పాటు చేసేందుకు ఉపక్రమించారు. మంగళవారం జరిగిన వేలంలో దేశీ మిర్చి ధర రూ. 28,000కు చేరింది.