SKLM: ఎచ్చర్ల మండల కేంద్రంలో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో మంగళవారం ‘పోషణ బి, పడాయి బి’ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిడిపిఓ పాపినాయుడు ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడిలో అందిస్తున్న పోషకాలను క్షేత్రస్థాయిలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని సూచించారు. అదేవిధంగా ఈ శిక్షణ కార్యక్రమం మూడు రోజులపాటు ఉంటుందన్నారు.