TG: అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా BRS ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ భావోద్వేగానికి గురయ్యారు. ‘నేను చనిపోతే నా పార్థివదేహంపై జాతీయ జెండా కప్పుతారు. అతికొద్ది మందికి దక్కే గౌరవాన్ని నేను పొందుతాను. KCR గారి ఆశీర్వాదంతో 3సార్లు MLA అయ్యాను. ఐదేళ్లు మంత్రిగా పనిచేశా. భగవంతుడు నాకిచ్చిన శక్తి మేరకు పనిచేశాను. సభలో మాట్లాడేప్పుడు అంతరాయం కలగకుండా సభాపతి చూడాలి’ అని అన్నారు.