కృష్ణా: ఘంటసాల మండలంలో నాలుగు రోజులపాటు ఉచిత ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి సుబ్బారావు పేర్కొన్నారు. 25వ తేదీన కొత్తపల్లి, శ్రీకాకుళం గ్రామాల్లో, 26న తాడేపల్లి, తెలుగురావుపాలెం గ్రామాల్లో, 27న చిట్టూరు, పాపవినాశనం గ్రామాల్లో, 28న పూషడం, గోగినేని పాలెం గ్రామాల్లో ఈ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.