ATP: గుంతకల్లు మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్లో మంగళవారం ఏపీ పోలీస్ శక్తి యాప్ గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టూ టౌన్ సీఐ మస్తాన్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఆపద సమయంలో బాలికలు తమను తాము ఎలా రక్షించుకోవాలో వివరించారు. మహిళా భద్రతకు కోసం శక్తి యాప్ ఉపయోగపడుతుందని విద్యార్థులకు అవగాహన కల్పించారు.