HYD: మార్చి నెల ముగియడానికి సమయం దగ్గరకు వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2వేల కోట్లు ఆస్తి పన్ను వసూలు చేయాలని గ్రేటర్ అధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకు రూ.1,720 కోట్లు వసూలు చేశారు. ఇంకా రూ.280 కోట్లు కావాలి. దాదాపు 5.75 లక్షల మంది నుంచి ఈ మొత్తం వసూలు చేయాలి. ఉగాది, రంజాన్ ఎలాగైనా అనుకున్న లక్ష్యం సాధించాలని అధికారులు భావిస్తున్నారు.