NLG: మిర్యాలగూడకు చెందిన గుంటోజు మధుబాబు (41) మద్యానికి బానిస అవడంతో భార్య వదిలేసింది. తరచు మద్యానికి డబ్బు అడగడంతో విసుగు చెందిన తల్లి మధుబాబుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో మనస్తాపానికి గురైన మధుబాబు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.