సిరియాలో బషర్ అల్ అసద్ పాలనలో 2013 నుంచి లక్ష మంది ప్రజలను వేధించినట్లు, హత్య చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుతైఫా, డమాస్కస్‌కు సమీపంలోని నఝాలోని సమాధుల పరిశీలనకు యూఎస్ అధికారులు వెళ్లారు. సామూహిక సమాధులను యూఎస్‌కు చెందిన యుద్ధ నేరాల మాజీ రాయబారి స్టీఫెన్ రాప్ పరిశీలించారు. నాజీల కాలం నుంచి ఇలాంటివి ఎన్నడూ చూడలేదని వ్యాఖ్యానించారు.