TG: కన్న కూతురిని ఓ కసాయి తండ్రి అక్రమంగా విక్రయించిన ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. అడిశర్లపల్లి మండలం పెద్దగట్టులో బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి చెందింది. అప్పటి నుంచి బిడ్డ.. తండ్రి మధు సంరక్షణలోనే ఉంది. ఈ క్రమంలో డబ్బులకు ఆశపడి కూతురిని అమ్మేశాడు. పసికందు కనిపించట్లేదని అమ్మమ్మ, తాతయ్యలు ఆరా తీయగా.. అసలు విషయం బయటకువచ్చింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.