AP: రెవెన్యూ సదస్సుల నిర్వహణపై మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులతో వీడియో కాన్పరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సదస్సుల ఏర్పాటు, మార్గదర్శకాలపై చర్చించారు. సదస్సులను మొక్కుబడిలా నిర్వహించవద్దని చెప్పారు. భూ వివాదాలకు ముగింపు పలికేలా సదస్సులు జరపాలని సూచించారు. భూ ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.