AP: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా నిర్వహిస్తామని ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. BC జనగణన ప్రక్రియ 99.44% పూర్తయిందని, మరో 10 రోజుల్లో ముగుస్తుందని వివరించారు. రిజర్వేషన్ల ఖరారు కోసం రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ను ఏర్పాటు చేశామని, వారం రోజుల్లో SEC నియామకం ఉండవచ్చన్నారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 16కు వాయిదా వేసింది.