డిజిటల్ యుగంతో కీడు కూడా పొంచి ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. డీప్ ఫేక్, గోప్యతకు భంగం వంటి విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. తప్పుడు సమాచారం ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల హక్కులను, గౌరవాన్ని కాపాడే డిజిటల్ వాతావరణాన్ని కల్పించడం చాలా ముఖ్యమని ‘మానవ హక్కుల దినోత్సవం’ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వ్యాఖ్యానించారు.